Header Banner

ఆంధ్రప్రదేశ్‌లో ఇంటర్‌ పరీక్షలకి సర్వం సిద్ధం... కేంద్రాల్లో 24 గంటల నిఘా! 144 సెక్షన్ అమలు!

  Thu Feb 27, 2025 08:41        Education

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్ రెగ్యులర్‌, ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ఇంటర్‌ పరీక్షలు మార్చి నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా మార్చి 1 నుంచి 20వ తేదీ వరకు రెగ్యులర్‌ ఇంటర్మీడియట్ పరీక్షలు జరగనున్నాయి. ఇందులో మార్చి 1 నుంచి 19 వరకు ఫస్ట్‌ ఇయర్‌, మార్చి 3 నుంచి 20 వరకు సెకండ్ ఇయర్‌ పరీక్షలు నిర్వహించనున్నారు. మొత్తం 26 జిల్లాల్లో దాదాపు 10,58,892 మంది విద్యార్ధులు ఈ పరీక్షలు రాయనున్నారు. ఓపెన్‌ స్కూల్‌ సొసైటీ ఇంటర్‌ పరీక్షలు మార్చి 3 నుంచి 15 వరకు జరగనున్నాయి. అయితే ఈ పరీక్షలకు సంబంధించిన హాల్ టికెట్లను కూడా ఇప్పటికే ఇంటర్‌ బోర్డు జారీ చేసింది. హాల్‌టికెట్లను విద్యార్థులే నేరుగా ఆన్‌లైన్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకునే అవకాశాన్ని ఈ పర్యాయం రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది.


ఇది కూడా చదవండివల్లభనేని వంశీకి మరో షాక్.. పోలీసుల విచారణలో కీలక మలుపు! కోర్టు కఠిన నిర్ణయం!


మరోవైపు పరీక్షల నిర్వహణకు అధికారులు అన్ని జిల్లాల్లో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. రెగ్యులర్‌ ఇంటర్‌ పరీక్షలకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1535 కేంద్రాలను ఏర్పాట్లు చేయగా.. అందులో 68 సెంటర్లను సున్నిత, 36 కేంద్రాలను అతి సున్నితమైనవిగా అధికారులు గుర్తించారు. వీటన్నింటిలో సీసీకెమెరాలను ఏర్పాటు చేశారు. పరీక్ష కేంద్రాలను సీసీ కెమెరాలతో అనుసంధానించి అమరావతిలోని చీఫ్‌ సూపరింటెండెంట్‌ లైవ్‌ స్ట్రీమింగ్‌లో పర్యవేక్షించేలా అధికారులు ఏర్పాట్లు చేశారు. పరీక్షలు జరిగే రోజుల్లో పరీక్ష కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144వ సెక్షన్‌ విధించనున్నారు. అలాగే చుట్టుపక్కల ఉండే జిరాక్స్‌ సెంటర్లు, ఇంటర్‌ నెట్‌ కేంద్రాలు పూర్తిగా మూసేలా అధికారులు చర్యలు చేపట్టారు. పరీక్షల నిర్వహణలో ఫిర్యాదుల స్వీకరణకు కంట్రోల్‌ రూమ్‌ టోల్‌ ఫ్రీ నంబరు 18004251531 ఏర్పాటు చేశారు. అన్ని జిల్లా కేంద్రాల్లో కంట్రోల్‌ రూమ్‌లను కూడా నెలకొల్పనున్నారు..


అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


పరీక్ష కేంద్రాల్లోకి ఎట్టిపరిస్థితుల్లోనూ మొబైల్‌ ఫోన్లు, ఎలక్ట్రానిక్‌ వస్తువులను అనుమతించేది లేదని ఇంటర్‌ బోర్డు స్పష్టం చేసింది. విద్యార్ధులతోపాటు ఉపాధ్యాయులు కూడా మొబైల్‌ ఫోన్లను పరీక్ష కేంద్రానికి బయటే వదిలేసి వెళ్లాల్సి ఉంటుందని పేర్కొంది. పరీక్షాకేంద్రాలకు విద్యార్ధులు సకాలంలో చేరుకోవడానికి వీలుగా విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఆర్టీసీ బస్సులు నడపనున్నారు. విద్యుత్తు అంతరాయం లేకుండా ఏర్పాట్లు చేయనున్నారు. ప్రశ్నపత్రాలను పోలీసు అధికారుల సమక్షంలో భద్రపరిచి.. ఎలాంటి లీకేజీలకు తావులేకుండా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు విద్యార్థులకు ఇబ్బంది లేకుండా అన్ని ఏర్పాట్లు చేపట్టడంతో పాటు ప్రతి కేంద్రంలో మౌలిక వసతులు సదుపాయాలను అధికారులు పూర్తి చేశారు.


ఇది కూడా చదవండివైసీపీకి మరో బిగ్ షాక్.. కీలక నేతపై కేసు నమోదు! పోలీసుల దర్యాప్తు వేగవంతం!


మేం ఆంధ్రులం అనే భావనే లేదు.. ప్రజలకు కులాలే గుర్తు! పవన్ కల్యాణ్ సంచలన వ్యాఖ్యలు!


గ్రాడ్యుయేట్ ఓటు కోసం అది తప్పనిసరి.. లేకుంటే హక్కు కోల్పోతారు! ఎన్నికల్లో కీలక మార్పులు!


ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ఏపీ ప్రజలకు భారీ గుడ్‌న్యూస్.. ప్రతీ సంవత్సరం ప్రతీ వ్యక్తికీ రూ.25లక్షలు.. ఏప్రిల్‌లో ప్రారంభం!

 

ట్రంప్ కీలక వ్యాఖ్యలు.. యుద్ధం ముగియాలంటే అదొక్కటే మార్గం!

 

ప్రజలకు అప్డేట్.. ఆధార్ కార్డులో కొత్త మార్పు! ఇది తెలుసుకోకపోతే నీ పరిస్థితి ఇక అంతే!

 

ఆంధ్రప్రదేశ్ లో మరో కొత్త హైవేకు లైన్ క్లియర్! ఈ జిల్లాలకు మహర్దశ!

 

పోలీసులపై చండాలమైన కామెంట్స్ చేసిన జగన్! ఆ కేసు పెట్టి జైలుకు పంపండి.. ఏపీ మంత్రి డిమాండ్!

 

గుంటూరులో జగన్‌ పర్యటన.. మిర్చి రైతులకి కన్నీరు.. 14 మిర్చి టిక్కీలు మాయం! యార్డ్ సీసీటీవీలలో..

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #andhrapravasi #inter boardexams #todaynews #flashnews #latestnews